ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 6:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బంజారాహిల్స్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 10 కాంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 10 కాంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ  బంజారాహిల్స్ లో మొక్కలు నాటారు. ఝాన్సీ   మాట్లాడుతూ బిగ్ బాస్ నుండి బయటకు రాగానే ప్రకృతి తో ముడిపడి ఉన్న నాకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.మట్టిని తాకిన మనసుకు అనే పాటను పాడి మొక్కను నాటడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.సకల జీవ రాషుల మనుగడకు మొక్కలు ఎంతో అవసరం అని వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందని అన్నారు.మొక్కలు నాటి వాటిని రక్షన చేస్తేనే రేపటి తరాలకు మంచి వాతావరణం ఇచ్చిన వాళ్ళము అవుతాము అన్నారు. నీళ్లనే కొనుక్కోవాల్సిన అవసరం వస్తది అని ఎవరు అనుకోలేదు కానీ వచ్చింది అని ఆక్సీజన్ కొనుక్కునే పరిస్థితి రేపటి తరాలకు రావద్దు అంటే మొక్కలు నాటాలి అన్నారు.ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నిరంజన్ పూలే తదితరులు పాల్గొన్నారు.